- కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు: హోటల్లో ఫుడ్ క్వాలిటీ పై తనిఖీలు పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి ఆహార సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉండే హోటల్స్ సైతం గ్రామపంచాయతీ, ఫుడ్ సేఫ్టీ నుంచి పర్మిషన్లు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయాలన్నారు.
హోటల్స్ లో వాడే నూనెలు, ఇతర సరుకులు క్వాలిటీగా ఉన్నాయో లేదో ఆఫీసర్లు తనిఖీ చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఎండలు 40 డిగ్రీలు ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని , చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామసభల్లో అన్ని శాఖలు ప్రగతి వివరాలు ప్రస్తావించాలని ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రస్తావించాలన్నారు.
